'మీకు ఇష్టమైన ఆహరం?' సమాదానం ఏదైనా కావచ్చు...మనకు ఇష్టమైనది ఎప్పుడైనా ఎంతైనా తినొచ్చు. మరి ఇంకెందుకండి ఆలస్యం... నా బ్లాగ్ లో మీకు ఇష్టమైన ఆహరాన్ని రుచి చూడండి..

Wednesday, December 22, 2010

ఆలు సమోసా

కావలసినవి :
మైదా 250 గ్రా 
బంగాళదుంపలు 3
ఉల్లిపాయ 1 
వాము కొంచెం 
కర్వేపాకు కొంచెం 
కారం ,ఉప్పు సరిపడా 
పోపుదినుసులు 
నూనే వేయించుకోడానికి సరిపడా 
తయారీ విధానం :
1 . ముందుగా  బంగాళదుంపల ని ఉడకబెట్టుకొని తోక్కతిసి మేదుపుకోవాలి .
2 .ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని , కొంచం నూనే వేసుకుని వేడైన తర్వాత పోపు దినుసులు ,నిలువుగా తరిగిన ఉల్లిపాయ ని వేసుకొని వేయించుకోవాలి ,తర్వాత బంగాళదుంప మిశ్రమాన్ని ,కొంచెం కారం ,ఉప్పు , గరంమసాల వేసుకొని ఒక 3 నిమషాలు ముతపెట్టుకోవాలి..
3 .ఇప్పుడు ఒక గిన్నె తీసుకోని అందులో మైదా ,సరిపడా ఉప్పు ,కారం ,వాము ,కొంచెం మరగబెట్టిన నూనే వేసుకొని కొంచెం గట్టిగ పూరి పిండి లా కలుపుకొని ఒక్క 15 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి .
4 .ఇప్పుడు పిండిని చిన్న చిన్న పూరిలా చేసుకొని ,సగానికి కట్ చేయాలి.
5 .కట్ చేసిన పూరి లో ముందుగా  తయారు చేసిన కూర ను స్టుఫ్ఫ్ చేసి మడత పెట్టుకోవాలి.
6 .తయారు చేసుకున్న సమోసా లను బాగా మరిగిన నూనె లో దోరగా వేయించుకోవాలి.

No comments:

Post a Comment

Share |