'మీకు ఇష్టమైన ఆహరం?' సమాదానం ఏదైనా కావచ్చు...మనకు ఇష్టమైనది ఎప్పుడైనా ఎంతైనా తినొచ్చు. మరి ఇంకెందుకండి ఆలస్యం... నా బ్లాగ్ లో మీకు ఇష్టమైన ఆహరాన్ని రుచి చూడండి..

Wednesday, December 22, 2010

కార్న్ కాజు మసాల కర్రీ

కావలసినవి : 
బేబీ కార్న్ 6 
 జీడిపప్పు 50 గ్రా 
టమాటాలు 4
ఉల్లిపాయలు 2 
నూనె 200 గ్రా 
కొత్తిమీర కొంచెం 
కారం,ఉప్పు,గరంమసాల,మిరయాలపొడి,జీరా పొడి
తయారీ విధానం :
1 . ముందుగా  బేబీ కార్న్ ని కొంచెం ఉప్పు వేస్కొని ఉడకబెట్టుకొని , చిన్న చిన్న ముక్కలాగా తరిగి పక్కన పెట్టుకోవాలి.
2 .గ్రీవి కోసం :
  జీడిపప్పు ని మిక్సీ లో వేసి కొంచం ముద్దలా చేస్కోవాలి ,తర్వాత టామాటోలు ని కూడా  మిక్సీ వేస్కోవాలి.
3 .ఇప్పుడు స్టవ్ మీద గిన్నె  పెట్టుకొని ఒక 100 గ్రా నూనె పోసుకొని , అది వేడైన తర్వాత ముందుగ   జీడిపప్పుముద్ద వేసుకొని అడుగు అంటకుండా వేసిన  నూనె  అంతా  పైకి  తేరే  వరకు కలుపుతూ తర్వాత టామాటో ఫ్యురి ని కూడా వేస్కోవాలి ,మళ్ళ నూనె  అంతా  పైకి వచ్చే  వరకు వేపుకొని, అందులో కొంచెం ఉప్పు , కారం , గరంమసాల  , మిరయాలపొడి ,జీరా పొడి  వేసి కాసేపు మగ్గాక  పక్కన పెట్టుకోవాలి.
4 .ఇప్పుడు ఇంకో గిన్నె పెట్టుకొని అందులో మిగిలిన నూనె అంతా వేస్కోవాలి,  అది వేడైన తర్వాత కొంచం జీడిపప్పు , ముందుగ తరిగిపెట్టుకున్న ఉల్లిపాయ ముక్కులను వేస్కోవాలి ,తర్వాత ఉడకబెట్టిన బేబీ కార్న్ ,కొంచెం ఉప్పు , కారం , గరంమసాల  , మిరయాలపొడి ,జీరా పొడి వేసి కాసేపు వేగాక , ముందుగ తయారీ చేసిన గ్రేవి ని అందులో వేస్కోవాలి , ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేస్కొని మూత పెట్టుకోవాలి.
5 .ఒక్క 10 నిమిషాల  తర్వాత స్టవ్ ఆపుకొని సెర్వింగ్ బౌల్ లోకి తీస్కోవాలి .

అంతే ఘుమఘుమలాడే   కార్న్ కాజు మసాల కర్రీ  రెడీ !

No comments:

Post a Comment

Share |