'మీకు ఇష్టమైన ఆహరం?' సమాదానం ఏదైనా కావచ్చు...మనకు ఇష్టమైనది ఎప్పుడైనా ఎంతైనా తినొచ్చు. మరి ఇంకెందుకండి ఆలస్యం... నా బ్లాగ్ లో మీకు ఇష్టమైన ఆహరాన్ని రుచి చూడండి..

Wednesday, December 22, 2010

హరియాలి పన్నీర్


కావలసినవి :
పన్నీర్  1 కప్
కొత్తిమీర 3 కట్టలు 
టామాటో 1 చిన్నది
ఉల్లిపాయ 1 చిన్నది
అల్లం వెల్లులి పేస్టు సరిపడా 
గరమసల కొంచం
దనియాలపొడి  కొంచం
మిర్యాలపొడి  కొంచం
తయారీ విదానం : 
ముందుగ పన్నీర్ ని కొంచం నీళ్లు లో సరిపడా ఉప్పు వేసుకొని 3 నిమిషాలు ఉడికించి పక్కన పెట్టుకోవాలి.
తరిగిన ఉల్లిపాయ,టామాటో,కొత్తిమీర బాగా మిక్సి పట్టుకోవాలి.
ఇప్పుడు స్టవ్ మీద ఒక బాండి పెట్టుకొని  కొంచం నూనే పోసుకోవాలి అది వేడి ఎక్కినాక, అందులో తరిగిన ఉల్లిపాయ ముక్కలు,టామాటో వేసి కొంచం సేపు మగ్గనివ్వాలి .
తర్వాత   మిక్సి పట్టిన గ్రేవి ని కూడా వేస్కోవాలి.
ఇప్పుడు కొంచం దనియాలపొడి,మిర్యాలపొడి,గరమసల,పసుపు,కారం,సరిపడా ఉప్పు వేసుకోవాలి.
ఒక్క 5 నిమిషాలు మగ్గనిచ్చి స్టవ్ అర్పేయాలి.
అంతే గుమగుమలాడే  హరియాలి పన్నీర్ రెడీ!

No comments:

Post a Comment

Share |