'మీకు ఇష్టమైన ఆహరం?' సమాదానం ఏదైనా కావచ్చు...మనకు ఇష్టమైనది ఎప్పుడైనా ఎంతైనా తినొచ్చు. మరి ఇంకెందుకండి ఆలస్యం... నా బ్లాగ్ లో మీకు ఇష్టమైన ఆహరాన్ని రుచి చూడండి..

Wednesday, December 22, 2010

కాకరకాయ పులుసు కూర

కావలసినవి :
కాకరకాయలు  2
టామాటో 2
ఉల్లిపాయలు 2 
చింతపండు కొంచం 
బెల్లం 50 గ్రా
పోపు దినుసులు 
దానియలపొడి కొంచం 
కారం ,ఊప్పు సరిపడా
కొత్తిమీర ,కర్వేపాకు  
తయారీ విధానం :
ముందుగ కాకరకాయల ను చిన్న చిన్న ముక్కలుగా తరిగి కొంచం ఊప్పు వేసి బాగా కలుపుకోవాలి.తరువాత స్టవ్ పైన బాండి పెట్టుకొని కొంచం నూనే వేసి కాగాక కాకరకాయల ను బాగా వేయించి పక్కన పెట్టుకోవాలి.ఇప్పుడు అదే నూనే లో పోపుదినుసులు వేయాలి అవి వేగిన తర్వాత అందులో చిన్నగా తరిగిన ఉల్లిపాయ  ముక్కలు వేయాలి ,అవి వేగినతర్వాత వేయిన్చిపెట్టుకున్న కాకరకాయ ముక్కలు వేయాసి వేగనివ్వాలి ,తర్వాత చిన్నగా తరిగిన టమాటోలు కూడా వేసి బాగా మగ్గిన తర్వాత సరిపడా చింతపండు పులుసు,బెల్లం,కారం,ఊప్పు,ధనియాలపొడి వేసి మూత పెట్టుకొని ఒక్క 10 నిమషాలు ఉంచుకోవాలి.
ఇప్పుడు కొత్తిమీర కొంచం వేసుకొని సెర్వె చేస్కోవాలి

No comments:

Post a Comment

Share |