'మీకు ఇష్టమైన ఆహరం?' సమాదానం ఏదైనా కావచ్చు...మనకు ఇష్టమైనది ఎప్పుడైనా ఎంతైనా తినొచ్చు. మరి ఇంకెందుకండి ఆలస్యం... నా బ్లాగ్ లో మీకు ఇష్టమైన ఆహరాన్ని రుచి చూడండి..

Tuesday, December 28, 2010

Veg Bread Rolls

 
కావలసినవి :
బ్రెడ్ స్లిసులు 5
బంగాళాదుంపలు 2
కేరెట్ 2
మట్టార్ చిన్న కప్ 
అల్లం వెళ్లులి పేస్టు కొంచెం
కారం ,ఉప్పు ,గరంమసాల సరిపడా 
నూనె వేయించడానికి సరిపడా
                                                                       తయారీ విధానం :
1.ముందుగా బంగాళాదుంపలు,కేరెట్,మట్టార్ ను కొంచెం ఉప్పు వేసి కుక్కర్ లో 3 విజల్ లు వచ్చేవరకు ఉంచుకోవాలి.
2.ఇప్పుడు స్టవ్ మీద ఒక బాండి పెట్టుకొని అందులో కొంచెం నూనె పోసుకొని అల్లం వెళ్లులి పేస్టు కొంచెం వేసుకొని పచ్చివాసన పోయవరకు వేపుకోని స్టవ్ ఆర్పేయాలి,ఇప్పుడు అందులో కారం ,ఉప్పు ,గరంమసాల సరిపడా  వేసి బాగా కలుపుకోవాలి  .
3. ముందుగా ఉడకబెట్టిన బంగాళాదుంపలు,కేరెట్,మట్టార్ ను బాగా ముద్ద చేసుకొని ,ముందుగా కలిపి పెట్టుకున్న అల్లం వెళ్లులిమిశ్రమం లో కలపాలి.
4. స్టవ్ మీద ఒక బాండి పెట్టుకొని అందులో వేయించడానికి సరిపడా నూనె పోసుకోవాలి .
5.ఇప్పుడు  ఒక్కో  బ్రెడ్ స్లిసు ని తీస్కొని కొంచెం నీటిలో ముంచి ,బాగా పిండి అందులో ముందుగా రెడీ చేసిని కూర మిశ్రమాన్ని పెట్టి ఉండల్లా చేసుకోవాలి.
6.ఇప్పుడు నూనె లో తయారీ  చేసుకున్న ఉండలను బాగా వేయించుకొని ,టామాటో సాస్ తో తింటే చాలా బాగుంటాయి.

No comments:

Post a Comment

Share |