Thai Fried Rice
కావలసిన పదార్దాలు: బాస్మతి బియ్యం : రెండు కప్పులు
తరిగిన కూరగాయలు : ఒక కప్పు
టొమాటో : రెండు (ముక్కలు)
వెల్లుల్లి తురుము : ఒక టేబుల్ స్పూన్
ఫిస్ సాస్ : 3 టీస్పూన్స్
సోయా సాస్ : ఒక టీస్పూను
చిల్లీ సాస్ : 2 టీస్పూన్స్
నూనె : తగినంత
కొత్తిమీర : ఒక కట్ట
కీరదోస : ఒకటి | |
తయారీ విధానం: ముందుగా అన్నం వండి చల్లార్చాలి.అన్నం ముద్దగా కాకుండా పొడిపొడి గా వుండేలా వండుకోవాలి. ఒక బాణలిలో నూనె వేసి కొంచెం సేపు కాగనివ్వాలి.అందులో తరిగిన కూరగాయ ముక్కలు,టొమాటో ముక్కలు వేసి దోరగా వేయించాలి. వీటిలో వెల్లుల్లి తురుమును కూడా వేసి బాగా వేగనివ్వాలి.ఆపై ఫిష్ సాస్,సోయాసాస్,చిల్లీసాస్ వేసి కలపాలి. ఈ మిశ్రమంలో సిద్దంగా వుంచిన అన్నాన్ని వేసి తిప్పాలి. కొంచెం ముదురు రంగు రాగానే ఉప్పు వేసి సమానంగా కలిపి స్టౌ పై నుండి దించేయాలి.వేడి థాయ్ ఫ్రైడ్ రైస్ పై కొత్తిమీర,కీరదోస ముక్కలు వేసి అలంకరించాలి. |
No comments:
Post a Comment