Masala Corn
కావలసినవి: మొక్కజొన్న కంకులు -2
ఉల్లిపాయలు - 3
పచ్చిమిర్చి - 2
ఉప్పు సరిపడా
గరంమసాల కొంచెం
పసుపు కొంచెం
పోపు దినుసులు
కార్వేపాకు
నూనె కొంచెం | |
తయారీ విధానం: 1 . ముందుగా మొక్కజొన్న కంకులను కుక్కర్ లో సరిపడా ఉప్పు వేసుకొని ఉడకబెట్టుకోవాలి.
2 . ఇప్పుడు పచ్చిమిర్చి,ఉల్లిపాయలు, ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి.
3 . స్టవ్ మీద బాండి పెట్టుకొని కొంచెం నూనె పోసుకోవాలి,ఇప్పుడు పోపుదినుసులు వేగాక ముందుగా తయారుచేసి పెట్టుకున్న ఉల్లిపాయ పేస్టు ని వేసుకోవాలి ,కొంచెం పసుపు ,గరంమసాల వేసుకొని పచ్చివాసన పోయేవరకు వేపుకోవాలి.
4 . ముందుగా ఉడకబెట్టిన మొక్కజొన్న కంకులను ఇప్పుడు ఆ మసాల లో వేసుకొని,స్టవ్ ని స్లో లో పెట్టుకొని ముతపెట్టుకోవాలి.
5 . 5 నిమషాలు తర్వాత స్టవ్ ఆపుకొని ,సెర్వింగ్ బౌల్ లోకి తీసుకోవాలి.
అంతే ! వేడి వేడి మసాల కార్న్ READY |
No comments:
Post a Comment