'మీకు ఇష్టమైన ఆహరం?' సమాదానం ఏదైనా కావచ్చు...మనకు ఇష్టమైనది ఎప్పుడైనా ఎంతైనా తినొచ్చు. మరి ఇంకెందుకండి ఆలస్యం... నా బ్లాగ్ లో మీకు ఇష్టమైన ఆహరాన్ని రుచి చూడండి..

Saturday, January 1, 2011

MealMaker Pakoda

కావలసిన పధార్ధాలు:
మీల్ మేకర్ 100 గ్రా
సెనగపిండి 100 గ్రా
బియ్యంపిండి 50 గ్రా
కర్వేపాకు 2 రెబ్బలు
ఉల్లిపాయ ఒకటి
గరంమసాల సరిపడగ
కారం,ఉప్పు తగినంత

తయారుచేసె విధానం:
ముందుగా మీల్ మేకర్ ని ఒక 20 నిమషాలు నానబెట్టుకోవాలి.ఒక గిన్నె లో సెనగపిండి,బియ్యంపిండి,గరంమసాల,కారం,ఉప్పు,కొంచెం తినెసోడా,కొంచెం వెడి నూనె వేసుకొని పకోడి పిండి లా కలుపొకొవాలి.ఇప్పుడు అందులో ముందుగా నానబెట్టిన మీల్ మేకర్ ని కలుపుకొని ఒక్కొకట్టిగా మరుగుతున్న నూనె లో వేసి వేయించుకోవాలి.
వేయించుకున్న వాటిని ఒక ప్లేటులో కి తీసుకొని చిన్న చిన్న ముక్కలు గా తరిగిన ఉల్లిపాయలు,కరవెపాకు తో గార్నిష్ చేసుకోవాలి.

అంతే వేడివేడి మీల్ మేకర్ పకోడి రెడీ.

No comments:

Post a Comment

Share |