'మీకు ఇష్టమైన ఆహరం?' సమాదానం ఏదైనా కావచ్చు...మనకు ఇష్టమైనది ఎప్పుడైనా ఎంతైనా తినొచ్చు. మరి ఇంకెందుకండి ఆలస్యం... నా బ్లాగ్ లో మీకు ఇష్టమైన ఆహరాన్ని రుచి చూడండి..

Monday, January 24, 2011

Baby Corn Pakoda


కావలసినవి:
బేబీ కార్న్ 5
సెనగపిండి ఒక కప్
బియ్యం పిండి కొంచెం
గరం మసాల సరిపడా 
కారం ,ఉప్పు సరిపడా
నూనె వేయించుకోడానికి సరిపడా


తయారీ విధానం :
1 . కార్న్ ని  2 ముక్కాలా గా పొడుగ్గా కోసుకోవాలి .
2 . ఒక గిన్నె లో సెనగపిండి,బియ్యం పిండి,గరం మసాల,కారం ,ఉప్పు అన్ని వేసి బజ్జీల పిండి లా కలుపుకోవాలి .
3 . ఇప్పుడు స్టవ్ మీద బాండి పెట్టుకొని నూనె బాగా వేడిక్కిన తర్వాత  ఒక్కొకటి గా కార్న్ ని ఆ పిండి లో ముంచి బజ్జీలా వేయించుకోవాలి .
4 . బాగా వేయించుకున్న తర్వాత ఒక ప్లేట్ లోకి తీసుకోని, టామాటో సాస్ తో తింటే బాగుంటాది.

No comments:

Post a Comment

Share |